logo

కేంద్రమంత్రి రాజీనామా చేయాలి

రైలు ప్రమాదానికి బాధ్యత వహించి కేంద్రమంత్రి రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌ డిమాండ్‌ చేశారు.

Published : 19 Jun 2024 00:53 IST

బాలకృష్ణన్‌

విలేకరులతో మాట్లాడుతున్న బాలకృష్ణన్‌

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: రైలు ప్రమాదానికి బాధ్యత వహించి కేంద్రమంత్రి రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం దిండుక్కల్‌లో విలేకరులతో మాట్లాడారు. పశ్చిమబెంగాల్‌లో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారన్నారు. ప్రమాదానికి బాధ్యతవహించి కేంద్ర రైల్వేమంత్రి వెంటనే రాజీనామా చేయాలన్నారు. పదేళ్ల్లుగా ఇలాంటి రైలు ప్రమాదాలు చాలానే జరిగాయన్నారు. సాంకేతిక సదుపాయాలు వస్తున్నా ప్రమాదాలను అడ్డుకోవడంపై కేంద్రప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. నీట్‌ వద్దని తొలిసారిగా తమిళనాడు పిలుపినిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు గుజరాత్, కేరళ రాష్ట్రాలు కూడ వద్దనే పరిస్థితికి వచ్చాయన్నారు. మేట్టూర్‌ నుంచి 12న నీటిని విడుదల చేయకపోవడంతో కావేరి డెల్టా రైతులు సాగు చేయలేని స్థితిలో ఉన్నారన్నారు. రాష్ట్రానికి కావేరి నీరు అందేలా కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరపాలన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని