logo

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కృత్రిమ గర్భధారణ కేంద్రం

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కృత్రిమ గర్భధారణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ తెలిపారు.

Published : 19 Jun 2024 00:59 IST

మంత్రి మా.సుబ్రమణియన్‌

ఆరోగ్యకేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి మా.సుబ్రమణియన్‌

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కృత్రిమ గర్భధారణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ తెలిపారు. తంజావూర్‌ జిల్లా ఓరత్తూర్‌లో మంగళవారం రూ.30 లక్షలతో నిర్మించిన నూతన ఆరోగ్యకేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల చెంతకే వైద్యం పథకం కింద ఇప్పటివరకు 1.70 కోట్ల మంది లబ్ధి పొందారన్నారు. ఇన్నుయిర్‌ కాప్పోం, నమ్మైకాక్కుం 48 పథకం కింద 2.56 లక్షల మంది ప్రయోజనం పొందారన్నారు. తంజావూర్‌లోనూ పిల్లల సంక్షేమ ఆస్పత్రి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. చెన్నై ఎగ్మూర్‌ పిల్లల సంక్షేమ ఆస్పత్రిలో రూ.7 కోట్లతో కృత్రిమ గర్భధారణ కేంద్రం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఇక్కడ పూర్తిగా ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్‌గా రూ.లక్షలు ఖర్చవుతుండటంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రిలోనే కృత్రిమ గర్భధారణ కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇక్కడి ఫలితాలను అనుసరించి మరిన్ని కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వివరించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని