logo

తమిళనాడు ప్రభుత్వంపై నటుడు సూర్య పరోక్ష విమర్శ

కళ్లకురిచ్చి జిల్లా కల్తీసారా దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై నటుడు సూర్య పరోక్షంగా విమర్శలు చేశారు. ఆయన తన ఎక్స్‌ పేజీలో... చిన్న ఊరులో 50 మరణాలు తుపాను, వరదలువంటి విపత్తు కాలాల్లోనూ చోటుచేసుకోని విషాదమన్నారు.

Published : 22 Jun 2024 05:02 IST

చెన్నై, న్యూస్‌టుడే: కళ్లకురిచ్చి జిల్లా కల్తీసారా దుర్ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై నటుడు సూర్య పరోక్షంగా విమర్శలు చేశారు. ఆయన తన ఎక్స్‌ పేజీలో... చిన్న ఊరులో 50 మరణాలు తుపాను, వరదలువంటి విపత్తు కాలాల్లోనూ చోటుచేసుకోని విషాదమన్నారు. వరుసగా పెరుగుతున్న మరణాలు, బాధితుల ఆక్రందన మనసును వణికిస్తున్నాయని తెలిపారు. గత ఏడాది విళుపురం జిల్లాలో మిథనాల్‌ కలిపిన కల్తీసారా తాగి 22 మంది మరణించగా కఠిన చర్యలు చేపట్టనున్నట్టు ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఎలాంటి మార్పు జరగలేదని ప్రస్తుత ఘటన నిరూపిస్తోందని తెలిపారు. ప్రభుత్వాలు(డీఎంకే, అన్నాడీఎంకే) టాస్మాక్‌ దుకాణాలు ద్వారా ప్రజలను మద్యం తాగిస్తున్న దుస్థితి నెలకొందని, టాస్మాక్‌లో రూ.150 ఖర్చుపెట్టి తాగేవాళ్లు డబ్బు లేనప్పుడు రూ.50కు కల్తీసారా తాగుతున్నారని పేర్కొన్నారు. ఇది వ్యక్తి సమస్య కాదని, ఓ కుటుంబ సమస్యని, సమాజ సమస్య అని తెలిపారు. మద్యనిషేధ విధానంలో ముఖ్యమంత్రి ప్రజా ప్రయోజన నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కల్తీసారాకు అడ్డుకట్ట వేయలేని ప్రభుత్వానికి ఖండన అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు