logo

ప్రభుత్వ వైఖరి ఖండిస్తూ భాజపా ఆందోళన

కళ్లకురిచ్చి కల్తీ సారా ఘటనకు ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ మదురై జిల్లా కలెక్టరు కార్యాలయం ఎదుట ఉన్న తిరువళ్లూరు విగ్రహం వద్ద భాజాపా తరఫున శనివారం ఆందోళన చేపట్టారు.

Updated : 23 Jun 2024 01:40 IST

ప్యారిస్‌: ఆందోళనకారులను అరెస్టు చేస్తున్న పోలీసులు

ప్యారిస్, న్యూస్‌టుడే: కళ్లకురిచ్చి కల్తీ సారా ఘటనకు ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ మదురై జిల్లా కలెక్టరు కార్యాలయం ఎదుట ఉన్న తిరువళ్లూరు విగ్రహం వద్ద భాజాపా తరఫున శనివారం ఆందోళన చేపట్టారు. ఆందోళనకు పోలీసుల అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో పోలీసులకి, భాజపా నేతలకు మధ్య వాగ్వాదం నెలకొని తోపులాట జరిగింది. అనంతరం ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

సేలంలో...

టీనగర్‌: సేలం జిల్లాలో శనివారం జరిగిన ఆందోళనకు జిల్లా ఉపాధ్యక్షుడు కేపీ రామలింగం నేతృత్వం వహించారు. జిల్లా నిర్వాహకులు, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. అనుమతి లేకుండా ఆందోళన చేస్తున్న కారణంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆందోళకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.

పీఎంకే తరఫున..

వేళచ్చేరి: ఆందోళన చేస్తున్న పీఎంకే కార్యకర్తలు

వేళచ్చేరి: కళ్లకురిచ్చి కల్తీ సారా ఘటనకు డీఎంకే ఎమ్మెల్యేలు కారణమని పీఎంకే వ్యవస్థాపకుడు రామదాసు, అధ్యక్షుడు అన్బుమణి రామదాసు ఆరోపించారు. ఈ నేపథ్యంలో శనివారం అసెంబ్లీ ప్రాగణంలో కళ్లకురిచ్చి జిల్లా శంకరాపురం ఎమ్మెల్యే ఉదయసూర్యన్, రిషివందియం ఎమ్మెల్యే వసంతం కార్తికేయన్‌... రామదాస్, అన్బుమణి తమపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే తాము తమ పదవులకు రాజీనామా చేస్తామని, అలా కాకుంటే తాము ఇద్దరిపై పరువునష్టం కేసు వేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం కళ్లకురిచ్చి నాలుగు రోడ్ల జంక్షన్‌లో పీఎంకే జిల్లా కార్యదర్శి తమిళరసన్‌ నేతృత్వంలో డీఎంకే ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని