logo

ఏఐతో భవతారణి స్వరం

దర్శకుడు వెంకట్‌ ప్రభు, విజయ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘గోట్‌’. చిత్రం తొలి సింగిల్‌ ‘విజిల్‌ పోడు’ విడుదలైన నేపథ్యంలో రెండో పాట ‘చిన్న చిన్న కణ్గళ్‌’ను శనివారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేశారు.

Published : 23 Jun 2024 00:44 IST

చెన్నై, న్యూస్‌టుడే: దర్శకుడు వెంకట్‌ ప్రభు, విజయ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘గోట్‌’. చిత్రం తొలి సింగిల్‌ ‘విజిల్‌ పోడు’ విడుదలైన నేపథ్యంలో రెండో పాట ‘చిన్న చిన్న కణ్గళ్‌’ను శనివారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో శుక్రవారం విడుదలైంది. కబిలన్‌ వైరముత్తు రాసిన ఈ పాటకు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం సమకూర్చారు. విజయ్, యువన్‌ శంకర్‌రాజా చెల్లెలైన నేపథ్య గాయని దివంగత భవతారణి ఏఐ స్వరంతో ఈ పాటను రూపొందించారు. ఇదిలా ఉండగా విజయ్‌ జన్మదినం సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి ‘గోట్‌’ నిర్మాణ సంస్థ గ్లింప్స్‌ వీడియో విడుదల చేసింది.


మళై పిడిక్కాద మనిదన్‌ రెండో పాట విడుదల

చెన్నై, న్యూస్‌టుడే: విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని నటిస్తున్న చిత్రం ‘మళై పిడిక్కాద మనిదన్‌’. చిత్రంలో శరత్‌కుమార్, సత్యరాజ్, డాలి ధనంజయ, మురళీ శర్మ, మేఘా ఆకాశ్, తలైవాసల్‌ విజయ్, శరణ్య పొన్‌వణ్ణన్‌ తదితరులు ఇతర తారాగణం. ఇన్ఫినిటీ ఫిలిమ్‌ వెంచర్స్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. తొలి పాట ఇప్పటికే విడుదలైన నేపథ్యంలో రెండో పాట ‘తేడియే పోరేన్‌’ శుక్రవారం సాయంత్రం విడుదలైంది. దీనిని నటుడు, సంగీత దర్శకుడైన హిప్‌ హాప్‌ ఆది, డి.ఇమాన్‌ విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని