logo

ధైర్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం

కల్తీసారా దుర్ఘటనను దాచిపెట్టకుండా డీఎంకే ప్రభుత్వం ధైర్యంగా పనిచేస్తోందని ఆ పార్టీ దక్షిణ చెన్నై ఎంపీ తమిళచ్చి తంగపాండియన్‌ తెలిపారు.

Published : 23 Jun 2024 01:00 IST

ఎంపీ తమిళచ్చి తంగపాండియన్‌

చెన్నై, న్యూస్‌టుడే: కల్తీసారా దుర్ఘటనను దాచిపెట్టకుండా డీఎంకే ప్రభుత్వం ధైర్యంగా పనిచేస్తోందని ఆ పార్టీ దక్షిణ చెన్నై ఎంపీ తమిళచ్చి తంగపాండియన్‌ తెలిపారు. ఆమె తన ఎక్స్‌ పేజీలో... కళ్లకురిచ్చి జిల్లాలో చోటుచేసుకున్న కల్తీసారా దుర్ఘటన బాధాకరమన్నారు. నిష్పక్షపాతంగా కఠిన చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించిందని తెలిపారు. చెంబరంపాక్కం జలాశయం నుంచి నీటిని విడుదల చేసినప్పుడు, తూత్తుకుడిలో తుపాకీ కాల్పులప్పుడు ఏమీ జరగనట్టు దాచేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం తరహాలో కాకుండా ధైర్యంగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వం ఇదేనని పేర్కొన్నారు. చావుతో రాజకీయాలు చేసే ప్రతిపక్షం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని