logo

ఎన్నికల సమయంలో ఏమైనా జరగొచ్చు

ఎన్నికల సమయంలో ఏమైనా జరగొచ్చని అన్నాడీఎంకే మాజీ మంత్రి జయకుమార్‌ తెలిపారు. తమిళగ వెట్రి కళగ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి శుభాకాంక్షలు తెలియజేశారు.

Published : 24 Jun 2024 01:00 IST

జయకుమార్‌

సైదాపేట, న్యూస్‌టుడే: ఎన్నికల సమయంలో ఏమైనా జరగొచ్చని అన్నాడీఎంకే మాజీ మంత్రి జయకుమార్‌ తెలిపారు. తమిళగ వెట్రి కళగ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే జయకుమార్‌ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో విజయ్‌ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? అని విలేకర్లు జయకుమార్‌ను ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన ఆయన.. విజయ్‌ ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని, రాజకీయ నాగరికతతో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపామని అన్నారు. శుభాకాంక్షలు తెలపడం కూటమిలోకి పిలిచినట్లు కాదన్నారు. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని తెలిపారు. ఎన్నికల సమయంలో ఏమైనా జరగొచ్చని పేర్కొన్నారు. కళ్లకురిచ్చి ఘటన డీఎంకే పాలన దుస్థితిని తెలియజేస్తుందన్నారు. కల్తీ సారా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని