logo

ఆస్పత్రి సిబ్బంది తీరును ఖండిస్తూ రాస్తారోకో

రాణిపేట జిల్లా అరక్కోణం ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట రోడ్డుపై కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగ జాతీయ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి నరేష్‌కుమార్‌ నేతృత్వంలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు.

Published : 24 Jun 2024 01:04 IST

మాట్లాడుతున్న నరేష్‌కుమార్‌

అరక్కోణం, న్యూస్‌టుడే: రాణిపేట జిల్లా అరక్కోణం ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట రోడ్డుపై కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగ జాతీయ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి నరేష్‌కుమార్‌ నేతృత్వంలో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నరేష్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ... తన స్నేహతుడు శుక్రవారం రాత్రి మృతి చెందాడని, అతని మృతదేహానికి ఇంతవరకు పోస్టుమార్టం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులు, డాక్టర్లు రోగులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని