logo

లోకో పైలట్ కు తీవ్ర అస్వస్థత

ఖానాఫూర్‌ నుంచి బెంగళూరు వెళ్లే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు లోక్‌ పైలట్ తీవ్ర అస్వస్థతకు గురికావటంతో ఆదివారం ఉదయం బాపట్ల జిల్లా బాపట్లలో అత్యవసరంగా నిలుపుదల చేశారు.

Published : 24 Jun 2024 01:19 IST

సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ బాపట్లలో నిలుపుదల

ప్రాంతీయ వైద్యశాలలో చికిత్సపొందుతున్న కుమరేశన్‌ 

బాపట్ల పట్టణం, న్యూస్‌టుడే : ఖానాఫూర్‌ నుంచి బెంగళూరు వెళ్లే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు లోక్‌ పైలట్ తీవ్ర అస్వస్థతకు గురికావటంతో ఆదివారం ఉదయం బాపట్ల జిల్లా బాపట్లలో అత్యవసరంగా నిలుపుదల చేశారు. తమిళనాడు రాష్ట్రం తుత్తుకూడికి చెందిన విసాద పెరుమాల్‌ కుమరేశన్‌ 34 ఏళ్లుగా చెన్నై సెంట్రల్‌ రైల్వే విభాగంలో లోకో పైలట్ గా విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో బెంగళూరు వెళ్లే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం ఉదయం విధులు నిర్వహిస్తున్న కుమరేశన్‌.. రైలు తెనాలి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా తక్కువ రక్తపోటుకు గురై ఒక్కసారిగా తీవ్ర అస్వస్థత పాలయ్యారు. గమనించిన సహాయ లోకో పైలట్ ఎ.విశ్వనాథ్‌ వెంటనే వైద్య సదుపాయం కల్పించాలంటూ విజయవాడ డివిజన్‌ ట్రాక్షన్‌ లోకో కంట్రోల్‌ అధికారులకు సమాచారం అందించారు. రైల్వే అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు బాపట్ల రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ మీనా వెంటనే రైలును బాపట్లలో నిలిపి కుమరేశన్‌ను 108 అంబులెన్స్‌ ద్వారా బాపట్ల ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. తర్వాత రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ రైలులోని లోకో పైలట్ ను సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో విధులకు కేటాయించారు. కుమరేశన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి ఆదివారం రాత్రి డిశ్ఛార్జ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని