logo

పిల్లలకు తమిళ పేర్లు పెట్టండి: సీఎం స్టాలిన్‌

పుట్టే పిల్లలకు అందమైన తమిళపేర్లు పెట్టాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. డీఎంకే థౌజండ్‌లైట్స్‌ తూర్పు కార్యదర్శి అన్బుదురై ఇంటి వివాహ కార్యక్రమం నగరంలో సోమవారం జరిగింది.

Updated : 25 Jun 2024 09:48 IST

వరుడికి మంగళసూత్రం అందిస్తున్న స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: పుట్టే పిల్లలకు అందమైన తమిళపేర్లు పెట్టాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ పిలుపునిచ్చారు. డీఎంకే థౌజండ్‌లైట్స్‌ తూర్పు కార్యదర్శి అన్బుదురై ఇంటి వివాహ కార్యక్రమం నగరంలో సోమవారం జరిగింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ తన సతీమణి దుర్గతో కలిసి హాజరయ్యారు. తన చేతుల మీదుగా వరుడికి మంగళసూత్రాన్ని అందించారు. వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విప్లవ రచయిత పావేందర్‌ భారతిదాసన్‌ చెప్పినట్లు ఇంటికి దీపంగా, దేశానికి కార్యకర్తలుగా ఉండి సేవలు అందించాలని తెలిపారు. నూతన జంట తమకు పుట్టే పిల్లలకు అందమైన తమిళపేర్లు పెట్టాలని, తమిళ భాషకు వన్నె తీసుకురావాలని పిలుపునిచ్చారు. అన్బుదురై పార్టీకి చేసిన కృషి, పార్టీలో ఆయన అంచలంచెలుగా ఎదిగిన వైనం వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని