logo

మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ అరెస్టు

మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్, ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మదురై తిరుమంగళం వైపు దిండుక్కల్‌-కన్నియాకుమరి వెళ్లే నాలుగు వరుసల రోడ్డులో కప్పలూర్‌ టోల్‌ప్లాజా ఉంది.

Published : 11 Jul 2024 00:26 IST

పోలీసు వాహనంలో ఆర్బీ ఉదయకుమార్‌

ప్యారిస్, న్యూస్‌టుడే: మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్, ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మదురై తిరుమంగళం వైపు దిండుక్కల్‌-కన్నియాకుమరి వెళ్లే నాలుగు వరుసల రోడ్డులో కప్పలూర్‌ టోల్‌ప్లాజా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్‌ సరిహద్దు, కప్పలూర్‌ నుంచి 2 కి.మీ. దూరంలో టోల్‌ప్లాజా ఏర్పాటు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. 12 ఏళ్లకు పైగా స్థానికుల వాహనాలకు రుసుము వసూలు చేస్తుండటంతో ఆందోళనలు జరుగుతున్నాయి. 2020 నుంచి 2024 వరకు టోల్‌ప్లాజా దాటి వెళ్లారని తెలిపి రూ.50 వేల నుంచి రూ.22 లక్షల వరకు రుసుము చెల్లించాలని గత వారం స్థానిక వాహనచోదకులకు లీగల్‌ నోటీసు పంపారు. ఇది ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. బుధవారం నుంచి వారికి రుసుము నుంచి మినహాయింపు లేదని, ప్రస్తుతం ఉన్నదాంట్లో 50 శాతం చెల్లించాలని ప్రకటించారు. వాహనచోదకులు టోల్‌ప్లాజా ముట్టడించి ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ పాల్గొన్నారు. పోలీసులు చర్చించినా ఫలితం లేకపోవడంతో ఉదయకుమార్‌ సహా ఆందోళన చేపట్టిన వారిని అరెస్టు చేశారు.

రోడ్డుపై బైఠాయించిన స్థానికులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని