logo

ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు ర్యాంకుల జాబితా విడుదల

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ర్యాంకుల జాబితాను బుధవారం డైరెక్టరేట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ వీరరాఘవరావ్‌ విడుదల చేశారు.

Published : 11 Jul 2024 00:28 IST

చెంగల్పట్టు విద్యార్థినికి మొదటిస్థానం

జాబితా విడుదల చేస్తున్న వీరరాఘవరావ్‌

ఆర్కేనగర్, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ర్యాంకుల జాబితాను బుధవారం డైరెక్టరేట్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ వీరరాఘవరావ్‌ విడుదల చేశారు. 2,53,954 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరరాఘవరావ్‌ మాట్లాడుతూ.. జనరల్‌ కేటగిరీలో చెంగల్పట్టు జిల్లాకు చెందిన లక్ష్మి, మొదటిస్థానంలో, తిరునెల్వేలికి చెందిన నిలంజన అనే విద్యార్థినులు రెండోస్థానంలో నిలిచారన్నారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు 7.5శాతం రిజర్వేషన్‌ కింద సేలం జిల్లాకు చెందిన రావిని అనే విద్యార్థిని మొదటిస్థానం, కోయంబత్తూర్‌కు చెందిన కృష్ణ రెండోస్థానంలో నిలిచారు. ఈ ఏడాది ర్యాంకుల జాబితాలో 200కు 200 కటాఫ్‌ మార్కులు 65మంది విద్యార్థులు పొందారన్నారు. ఇందులో 58 మంది రాష్ట్ర పాఠ్యాంశంలోనూ, ఏడుగురు ఇతర పాఠ్యాంశంలో చదివినవారన్నారు. కౌన్సెలింగ్‌ 22న ప్రారంభమై సెప్టెంబరు 3న ముగుస్తుందన్నారు. 7.5 శాతం రిజర్వేషన్‌ విభాగానికి జులై 22 నుంచి 25 వరకు జరగనుందన్నారు. జనరల్‌ విభాగానికి 29న నుంచి కౌన్సెలింగ్‌ మొదలవనుందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని