logo

Earthquake: వణికిపోయారు..!

మంగళవారం రాత్రి.. సమయం 10.15 గంటలు.. అంతా నిద్రలోకి జారుకుంటున్న వేళ.. చలిపులి భయంతో ఇళ్లల్లోనే ఉన్నారు.. ఇంతలోనే ఒక్కసారిగా చిన్నపాటి కుదుపు..

Updated : 05 Jan 2022 06:14 IST

ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు


కవిటిలో ఇళ్ల నుంచి భయంతో బయటకు వచ్చిన జనం

మంగళవారం రాత్రి.. సమయం 10.15 గంటలు.. అంతా నిద్రలోకి జారుకుంటున్న వేళ.. చలిపులి భయంతో ఇళ్లల్లోనే ఉన్నారు.. ఇంతలోనే ఒక్కసారిగా చిన్నపాటి కుదుపు.. వస్తువులు కదులున్నాయ్‌.. మనుషులు ఊగుతున్నారు.. ఇదో విపత్తుగా గుర్తించిన అక్కడి ప్రజలు పిల్లాపాపలతో పరుగులు తీశారు.. భూకంపం వచ్చిందంటూ వీధుల్లోకి వచ్చేశారు..

ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇచ్ఛాపురంలో పది నిమిషాల వ్యవధిలో మూడు సార్లు జరిగింది. మూడోసారి తీవ్రత ఉండటంతో బ్రాహ్మణవీధిలో ఒక ఇంటి స్లాబు బీటలు వారింది. అర్ధరాత్రి ఒంటిగంట తరువాత మళ్లీ కంపించింది. రత్తకన్న, వీకేపేట, దాసన్నపేట, దానంపేటలో ప్రభావం కనిపించింది. దీనిపై తహసీల్దారు బి.శ్రీహరిబాబు మాట్లాడుతూ ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం వచ్చిందని, తీవ్రత చాలా తక్కువ అని అన్నారు. కవిటి మండలం కవిటి, డి.జి.పుట్టుగ, ప్రగడపుట్టుగ, ఇద్దవానిపాలెం, జగతి, రాజపురం, బెలగాంతో పాటు మరో పదిగ్రామాల్లో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి వరకూ ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.


బ్రాహ్మణవీధిలో ఓ ఇంటి స్లాబుకు ఏర్పడిన పగుళ్లు..

రత్తకన్నలోని ఓ ఇంట్లో చెల్లాచెదురుగా పడిన సామగ్రి

- న్యూస్‌టుడే, ఇచ్ఛాఫురం, కవిటి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని