logo

Gudivada Amarnath: ఆనాటి కూల్చివేతల వల్లే.. నేడు ఇక్కడ కూర్చున్నాం: మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్

‘అధికారంలో ఉండగా మా ప్రభుత్వం చేసిన కూల్చివేతల వల్లే నేడు ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది.

Updated : 23 Jun 2024 07:50 IST

భవనానికి అంటించిన నోటీసులు తొలగిస్తున్న మాజీ మంత్రి అమర్‌నాథ్‌ 

మధురవాడ, న్యూస్‌టుడే: ‘అధికారంలో ఉండగా మా ప్రభుత్వం చేసిన కూల్చివేతల వల్లే నేడు ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. లేదంటే ఈ రోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండే వాళ్లం’ అని మాజీమంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా సమాధానమిచ్చారు. ఎండాడ న్యాయ కళాశాల రోడ్డులోని వైకాపా జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. ముందుగా అనుమతుల అంశంపై కార్యాలయం గోడకు జీవీఎంసీ అధికారులు అంటించిన నోటీసును చదివి...ఆ తరువాత ఆయన తొలగించారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, ఎమ్మెల్సీ వి.కళ్యాణి, కొందరు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని