logo

ఇండో- జపాన్‌ ద్వైపాక్షిక విన్యాసాలు

ఇండియా, జపాన్‌ మారిటైం విన్యాసాలు (జిమెక్స్‌-2024) కోసం భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ శివాలిక్‌ నౌక జపాన్‌లోని యోకొసుక తీరానికి చేరుకుందని నేవీ వర్గాలు మంగళవారం తెలిపాయి.

Updated : 12 Jun 2024 05:24 IST

జపాన్‌ తీరానికి చేరుకున్న ఐఎన్‌ఎస్‌ శివాలిక్

సింధియా, న్యూస్‌టుడే : ఇండియా, జపాన్‌ మారిటైం విన్యాసాలు (జిమెక్స్‌-2024) కోసం భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ శివాలిక్‌ నౌక జపాన్‌లోని యోకొసుక తీరానికి చేరుకుందని నేవీ వర్గాలు మంగళవారం తెలిపాయి. ఇరు దేశాల మధ్య ఎనిమిదో దశగా విన్యాసాలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి. తీరానికి చేరుకున్న భారత్‌ నేవీ అధికారులకు జపాన్‌ స్వీయరక్షణ దళం (జేఎంఎస్‌డీఎఫ్‌) కమాండర్‌ వైస్‌ అడ్మిరల్‌ ఇతోహిరోషి, భారత రాయబారి సిబి జార్జి సాదర స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య హార్బర్‌ ఫేజ్, సీఫేజ్‌తో అంతర్గత నేవీ ఆపరేషన్లు, కార్యకలాపాలు వంటి అంశాలతో విన్యాసాలు సాగుతాయని నేవీ వర్గాలు వెల్లడించాయి. పసిఫిక్‌ తీర ప్రాంత భద్రతకు ఇరుదేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగుతాయని వివరించాయి.

భారత సిబ్బందికి స్వాగతం పలుకుతున్న జపాన్‌ అధికారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని