logo

రూ.34.62 కోట్లతో యంత్రం వితరణకు ఒప్పందం

అగనంపూడి హోమీబాబా క్యాన్సర్‌ ఆసుపత్రికి రింగ్‌ బేస్‌డ్‌ లీనియర్‌ ఎక్స్‌లేటర్‌ (లినాక్‌) యంత్రం సమకూరనుంది. సామాజిక బాధ్యత కింద రూ.34.62 కోట్ల వ్యయంతో ఈ యంత్రాన్ని వితరణగా ఇవ్వడానికి పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ముందుకొచ్చింది.

Published : 12 Jun 2024 02:49 IST

ఒప్పంద పత్రాలు చూపుతున్న మహంత్‌శెట్టి, సూర్యచంద్రరావు

అగనంపూడి, న్యూస్‌టుడే : అగనంపూడి హోమీబాబా క్యాన్సర్‌ ఆసుపత్రికి రింగ్‌ బేస్‌డ్‌ లీనియర్‌ ఎక్స్‌లేటర్‌ (లినాక్‌) యంత్రం సమకూరనుంది. సామాజిక బాధ్యత కింద రూ.34.62 కోట్ల వ్యయంతో ఈ యంత్రాన్ని వితరణగా ఇవ్వడానికి పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ముందుకొచ్చింది. మంగళవారం ఆసుపత్రిలో ఏర్పాటైన కార్యక్రమంలో ఆసుపత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ ఉమేష్‌ మహంత్‌ శెట్టి, పవర్‌ గ్రిడ్‌ సంస్థ ప్రతినిధి సూర్యచంద్రరావు పాల్గొని.. ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఉమేష్‌ మహంత్‌శెట్టి మాట్లాడుతూ రేడియోథెరపీ ద్వారా క్యాన్సర్‌ రోగులకు మెరుగైన చికిత్స అందించడానికి నూతన యంత్రం ఉపయోగపడుతుందన్నారు. ఆసుపత్రిలో మరిన్ని వైద్య సదుపాయాల కల్పనకు ప్రైవేటు సంస్థలు, ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరారు. పవర్‌గ్రిడ్‌ సంస్థ ప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని