logo

ప్రాణం తీసిన ఈత సరదా

నదిలో స్నానం చేయాలనే సరదా ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది. గ్రామీణ ఎస్సై సింహాచలం కథనం ప్రకారం.. తెరువుపల్లి సమీపంలో మైనర్‌ శారదా నదిలోకి మంగళవారం రాంబిల్లి మండలం దిమిలి గ్రామానికి చెందిన యర్రంశెట్టి శ్రీను (22), గాజువాకకు చెందిన బంగారి జగన్‌ (18) స్నానానికి దిగారు.

Published : 12 Jun 2024 02:56 IST

నదిలో ఇద్దరు యువకుల దుర్మరణం

విగతజీవులుగా పడి ఉన్న జగన్, శ్రీను

ఎలమంచిలి గ్రామీణం, న్యూస్‌టుడే: నదిలో స్నానం చేయాలనే సరదా ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది. గ్రామీణ ఎస్సై సింహాచలం కథనం ప్రకారం.. తెరువుపల్లి సమీపంలో మైనర్‌ శారదా నదిలోకి మంగళవారం రాంబిల్లి మండలం దిమిలి గ్రామానికి చెందిన యర్రంశెట్టి శ్రీను (22), గాజువాకకు చెందిన బంగారి జగన్‌ (18) స్నానానికి దిగారు. ప్రమాదశాత్తు గోతిలో పడి లోతు ఎక్కువగా ఉండటంతో శ్రీను మునిగిపోయాడు. శ్రీనును రక్షించడానికి జగన్‌ ప్రయత్నించాడు. ఈ సమయంలో అతను గోతిలో జారిపడిపోయాడు. పరిసర ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి చేరుకుని వీరిని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే శ్రీను మృతి చెందగా.. జగన్‌ను దిమిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ మృతి చెందాడు.

వారం రోజుల కిందట..: గాజువాకకు చెందిన జగన్‌ వారం రోజుల కిందట దిమిలిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఇతను ఇంటర్‌ పూర్తి చేసి ఎంసెట్‌ పరీక్ష రాశాడు. శ్రీను ఐటీఐ పూర్తి చేసి అప్రంటీస్‌ చేస్తున్నాడు. వీరిద్దరు మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని