logo

విద్యుత్తు కాంతుల్లో కలెక్టరేట్‌ ధగధగ

రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని విద్యుత్తు వెలుగుల్లో తీర్చిదిద్దారు. సోమవారం నుంచి మూడురోజుల పాటు విద్యుత్తు కాంతుల్లో కట్టడాన్ని ఉంచాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.

Published : 12 Jun 2024 03:08 IST

వెలుగుల్లో కలెక్టరేట్‌ భవన సముదాయం

వన్‌టౌన్, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని విద్యుత్తు వెలుగుల్లో తీర్చిదిద్దారు. సోమవారం నుంచి మూడురోజుల పాటు విద్యుత్తు కాంతుల్లో కట్టడాన్ని ఉంచాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. 2014లో హుద్‌హుద్‌ తుపాను తీవ్రతకు కలెక్టరేట్‌ భవనం దెబ్బతింది. నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రత్యేకంగా నిధులు కేటాయించి కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని పునరుద్ధరించారు. అంతేకాకుండా విద్యుత్తు వెలుగులు ఏర్పాటు చేయించారు. పునరుద్ధరించిన కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని 2017లో ప్రారంభించారు. ఇప్పుడు మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో రంగురంగుల విద్యుత్తు కాంతులతో నింపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని