logo

బాలలను బడికి పంపాలి

బాలలను బడికి పంపాలని ఎలమంచిలి అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ టి.వీరరాఘవేంద్రరావు సూచించారు.

Published : 13 Jun 2024 03:42 IST

కశింకోట, న్యూస్‌టుడే: బాలలను బడికి పంపాలని ఎలమంచిలి అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ టి.వీరరాఘవేంద్రరావు సూచించారు. బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నరసింగబిల్లి జీడిపిక్కల కర్మాగారంలో కార్మికులకు బుధవారం నిర్వహించిన అవగాహనా కార్యక్రమానికి మేజిస్ట్ర్టేట్‌ డి.వెంకటరావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలలను పనిలో చేర్చుకుంటే ఏర్పడే దుష్పరిణామాలను, వాటివల్ల ఎదురయ్యే నష్టాలను వివరించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు డి.నూకరాజు, బి.హరి శంకరరావు, పి.వి.రమణ, కర్మాగారం యాజమాని బి.అనిల్‌కుమార్, కార్మికశాఖ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని