logo

మహిళపై దాడి.. నిందితుడికి జైలు

జి.జానకయమ్మపేటలో మహిళపై దాడి కేసులో నిందితుడు గజ్జల రామ్‌గోపాల్‌కు రెండు నెలల జైలు శిక్ష విధించారు.

Published : 13 Jun 2024 03:44 IST

నక్కపల్లి, న్యూస్‌టుడే: జి.జానకయమ్మపేటలో మహిళపై దాడి కేసులో నిందితుడు గజ్జల రామ్‌గోపాల్‌కు రెండు నెలల జైలు శిక్ష విధించారు. సీఐ ఎ.విజయకుమార్‌ కథనం ప్రకారం.. చెరువు నీటి విషయమై గండికోట ఏడుకొండలుతో నిందితుడికి వివాదం తలెత్తింది. దీన్ని మనసులో పెట్టుకున్న రామ్‌గోపాల్‌ 2017 నవంబరు 23న పొలంలో పనిచేస్తున్న ఏడుకొండలు భార్యపై దాడికి పాల్పడ్డాడు. ఎస్సై సింహాచలం కేసు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో ఎలమంచిలి అసిస్టెంటు సెషన్స్‌ జడ్జి విజయ రెండు నెలల జైలు శిక్ష లేదా రూ. 10 వేలు జరిమానా చెల్లించాలని రామ్‌గోపాల్‌ను ఆదేశించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని