logo

ప్రతి విద్యార్థికి సకాలంలో కిట్లు

పాఠశాలలు పునః ప్రారంభమైన వెంటనే ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, కిట్లు అందజేయాలని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ సూచించారు. మునగపాక సీఆర్‌పీ కార్యాలయాన్ని బుధవారం ఆమె సందర్శించారు.

Published : 13 Jun 2024 03:46 IST

మునగపాక, న్యూస్‌టుడే: పాఠశాలలు పునః ప్రారంభమైన వెంటనే ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, కిట్లు అందజేయాలని డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ సూచించారు. మునగపాక సీఆర్‌పీ కార్యాలయాన్ని బుధవారం ఆమె సందర్శించారు. సీఆర్పీ కార్యాలయం నుంచి పాఠశాలలకు తరలిస్తున్న కిట్లను పరిశీలించారు. ఏ ఒక్క విద్యార్థికి కిట్లు అందలేదని ఫిర్యాదు రాకూడదన్నారు. స్కూల్‌ బ్యాగులకు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అధిక మంది విద్యార్థులు చేరేలా తల్లిదండ్రులను చైతన్యపర్చాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈకార్యక్రమంలో వెంకటేశ్వరరావు, గాలి అప్పారావు, ఎంఈఓలు వేణుగోపాలరావు, బుద్ధ శివనాయుడు, సీఆర్పీలు కర్రి లక్ష్మినారాయణ, బొడ్డేడ అచ్యుతకృష్ణ, ఎం.గోవింద, జి.నూకేష్, ఆర్‌.సత్తిబాబు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని