logo

తాళం వేసిన ఇంట్లో 191 గ్రాముల బంగారం చోరీ

తాళం వేసి ఉన్న ఇంట్లో దుండగులు చొరబడి బంగారం, నగదు అపపారించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 13 Jun 2024 03:56 IST

గురుద్వారా, న్యూస్‌టుడే: తాళం వేసి ఉన్న ఇంట్లో దుండగులు చొరబడి బంగారం, నగదు అపపారించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 4వ పట్టణ క్రైం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సీహెచ్‌ సూర్యప్రకాశ్‌రావు అక్కయ్యపాలెం నందగిరినగర్‌ రామలక్ష్మి అపార్ట్టుమెంటులో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఎల్‌ అండ్‌ టీ సంస్థలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నారు. ఈ నెల 7న ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి హైదరాబాద్‌ వెళ్లారు. బుధవారం ఇంటికి వచ్చి చూడగా బీరువా తీసి ఉండడాన్ని గమనించారు. అందులో పెట్టిన 191 గ్రాముల బంగారం, రూ.లక్ష నగదు కనిపించలేదు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. తూర్పు సబ్‌డివిజన్‌ క్రైం సీఐ ఆదామ్, ఎస్‌ఐ భాస్కరరావు క్లూస్‌టీంతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇంటి గేటుకు తాళాలు, మెయిన్‌ డోర్‌కు సెంట్రల్‌ లాక్‌ వేయకపోవడం, బీరువా తాళాలు పక్కనే పెట్టి ఉంచడంతో దుండగులు సులువుగా ఆభరణాలు దొంగలించుకుపోయారని పోలీసులు భావిస్తున్నారు. సీఐ ఆదామ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని