logo

ఎస్డీఎఫ్‌ బిల్లులపై ప్రభుత్వం ఆరా

తెదేపా అధికారంలో ఉండగా మహా విశాఖ నగరపాలక సంస్థ ఎస్డీఎఫ్‌ (స్పెషల్‌ డెవలప్‌మెంట ఫండ్‌) ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి గుత్తేదారులకు చెల్లించాల్సిన బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తుంది.

Published : 13 Jun 2024 04:04 IST

కార్పొరేషన్, న్యూస్‌టుడే: తెదేపా అధికారంలో ఉండగా మహా విశాఖ నగరపాలక సంస్థ ఎస్డీఎఫ్‌ (స్పెషల్‌ డెవలప్‌మెంట ఫండ్‌) ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి గుత్తేదారులకు చెల్లించాల్సిన బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఐదున్నరేళ్ల క్రితం ఎన్నికలకు ముందు రూ.38 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించి గుత్తేదారులకు అప్పగించారు. సామాజిక భవనాలు, రహదారులు, కాలువల నిర్మాణ పనులు చేసిన గుత్తేదారులకు వైకాపా ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. ఎస్డీఎఫ్‌ పనులు కావడంతో సీఎఫ్‌ఎంఎస్‌ (కాంప్రహెన్సివ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట సిస్టం)లో బిల్లులు అప్‌లోడ్‌ చేయాలని జీవీఎంసీ ఇంజినీర్లకు ఆదేశాలిచ్చింది.

గుత్తేదారులు సీఎఫ్‌ఎంఎస్‌ విధానం ద్వారా బిల్లులు అప్‌లోడ్‌ చేసినా నిధులు రాలేదు. దీంతో కొంత మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించి బిల్లులు మంజూరు చేయించుకున్నారు. న్యాయస్థానానికి వెళ్లని వారికి ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదు. కక్ష పూరితంగా అధికారులు వ్యవహరించడాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం జీవీఎంసీతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్డీఎఫ్‌ ద్వారా చేసిన పనుల వివరాలపై ఆరా తీస్తోంది. జీవీఎంసీలో చేసిన 69 పనులకు గాను ఇంకా రూ.5.07 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని