logo

ఆ ఆనంద క్షణాల్లో... జిల్లా నేతల సందడి

రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో జిల్లా తెదేపా నేతలు సందడి చేశారు.

Published : 13 Jun 2024 04:08 IST

వన్‌టౌన్, న్యూస్‌టుడే: రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో జిల్లా తెదేపా నేతలు సందడి చేశారు. కూటమి తరఫున గెలుపొందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, పార్టీల నేతలు, నియోజకవర్గాల బాధ్యులు, ముఖ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నియోజకవర్గానికి 200 మంది చొప్పున 28 ఆర్టీసీ బస్సుల్లో వెళ్లారు. పలువురు నాయకులు కార్లు, ఇతర వాహనాల్లో వెళ్లారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో నాయకులంతా పాల్గొని సందడి చేశారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్, గణబాబు, తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ, దక్షిణ నియోజకవర్గ బాధ్యులు సీతంరాజు సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం తర్వాత వీరంతా వెనుదిరిగారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు