logo

ఉద్యోగ నియామకాల్లో..ఉల్లంఘనలపై విచారణ

విశాఖ పట్నం ‘హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌- రక్షణ ఉత్పత్తుల సంస్థ’ ఉద్యోగ నియామకాల్లో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Published : 14 Jun 2024 03:00 IST

సింధియా, న్యూస్‌టుడే : విశాఖ పట్నం ‘హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌- రక్షణ ఉత్పత్తుల సంస్థ’ ఉద్యోగ నియామకాల్లో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ మేరకు న్యాయస్థానం నుంచి కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి, షిప్‌యార్డు ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్, షిప్‌యార్డు జనరల్‌ మేనేజర్‌(మానవ వనరులు)కు నోటీసులు అందాయి. విశాఖలోని షిప్‌యార్డు మేనేజర్‌ (సాంకేతిక) పోస్టుల భర్తీకి 2023 నవంబరు 17న ‘హెచ్‌ఆర్‌/ఇఎస్‌(0)/0102/03/2023 పేరిట ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆ నియామకాల ఫలితాలను 22.4.2024న ప్రకటించారు. అయితే ఎంపిక చేసిన జాబితాలో అర్హతలేని అభ్యర్థులు ఉన్నారని విశాఖలోని శ్రీహరిపురానికి చెందిన కె.కిరణ్‌కుమార్, మురళీనగర్‌కు చెందిన బి.అనంతనాయుడు, తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన ఎస్‌.వెంకట ఆనంద్‌కుమార్‌ 2024 మే 6న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 2024 మే 7న తొలిసారి విచారణ జరిగింది. ఈనెల 24న జరిగే మరో విచారణకు ప్రతివాదులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని