logo

మంత్రి పవన్‌కు అభినందనలు

మంత్రి పవన్‌ కల్యాణ్‌ను పాయకరావుపేట నియోజవర్గం జనసేన నేత గెడ్డం బుజ్జి అమరావతిలో కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Published : 14 Jun 2024 03:05 IST

పవన్‌ కల్యాణ్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేస్తున్న బుజ్జి 

పాయకరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: మంత్రి పవన్‌ కల్యాణ్‌ను పాయకరావుపేట నియోజవర్గం జనసేన నేత గెడ్డం బుజ్జి అమరావతిలో కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి కష్టపడి పని చేసినందుకు ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన బుజ్జిని పవన్‌ ప్రత్యేకంగా అభినందించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి నాదేండ్ల మనోహర్‌ను కూడా బుజ్జి కలిశారు. పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని  కోరారు. జనసేన నాయకులు గెడ్డం చైతన్య, జగ్గన్న దొర, నల్లల రత్నాజీ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని