logo

రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని మంత్రి వంగలపూడి అనిత విజయవాడలో మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. పదవి చేపట్టిన తర్వాత ఆమె ఆయ్యన్న వద్దకు వెళ్లి సత్కరించి ఆశీర్వాదం పొందారు.

Published : 14 Jun 2024 03:07 IST

అయ్యన్నను సత్కరిస్తున్న మంత్రి అనిత 

నక్కపల్లి, న్యూస్‌టుడే: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని మంత్రి వంగలపూడి అనిత విజయవాడలో మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. పదవి చేపట్టిన తర్వాత ఆమె ఆయ్యన్న వద్దకు వెళ్లి సత్కరించి ఆశీర్వాదం పొందారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించినట్లు అనిత వెల్లడించారు. అనిత కుమారుడు నిఖిల్, తెదేపా జిల్లా కార్యదర్శి లాలం కాశీనాయుడు పాల్గొన్నారు.

కనకదుర్గను దర్శించుకున్న అనిత: బెజవాడ కనకదుర్గమ్మను మంత్రి అనిత గురువారం దర్శించుకున్నారు. ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆమెకు అధికారులు, అర్చకులు ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు. దర్శనానంతరం పండిత ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందించారు.

పీలా, మళ్ల శుభాకాంక్షలు

అనకాపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనిత, అచ్చెన్నాయుడులను మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ గురువారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ మళ్ల సురేంద్ర, తెదేపా నాయకులు రామారావు, దాడి బుజ్జి, యల్లపు శ్రీనివాసరావు, వేగి కృష్ణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని