logo

వసతి గృహాలు పిలుస్తున్నాయ్‌..

జిల్లావ్యాప్తంగా సాంఘిక సంక్షేమశాఖకు చెందిన వసతిగృహాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Updated : 14 Jun 2024 05:18 IST

ప్రీమెట్రిక్‌లో 872, పోస్టు మెట్రిక్‌లో 672 ఖాళీలు
సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకులు కె.రామారావు

సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహాలు

న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ: జిల్లావ్యాప్తంగా సాంఘిక సంక్షేమశాఖకు చెందిన వసతిగృహాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నగర పరిధిలో వివిధ విద్యాసంస్థల్లో చదువుతూ సాంఘిక సంక్షేమశాఖకు చెందిన వసతిగృహాల్లో ప్రవేశాలు పొందాలనుకునే అర్హులైన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ డీడీ కె.రామారావు కోరారు. జిల్లావ్యాప్తంగా ప్రీమెట్రిక్‌-8, పోస్టుమెట్రిక్‌-14 వసతిగృహాలున్నాయన్నారు. ప్రీమెట్రిక్‌లో 4 బాలురు, 4 బాలికల వసతిగృహాలున్నాయని, పోస్టుమెట్రిక్‌ విభాగంలో కళాశాల బాలికల వసతిగృహాలు-7, బాలుర వసతిగృహాలు-7 చొప్పున ఉన్నాయన్నారు. వీటిలో వసతిగృహాల వారీగా రోస్టర్‌ ప్రకారం ఖాళీలను భర్తీ చేయటం జరుగుతుందన్నారు.

  • ప్రధానంగా ఎస్సీ విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుందని, తర్వాత ఎస్టీలు, బీసీలు, ఓసీలకు కూడా ఆయా రోస్టర్‌ ప్రకారం ఖాళీలను బట్టి వసతిగృహాల్లో ప్రవేశాలు కల్పించటం జరుగుతుందన్నారు.
  • 8 ప్రీమెట్రిక్‌ వసతిగృహాల్లో ఎస్సీలకు 823, బీసీలకు 29, ఓసీలకు 20 చొప్పున మొత్తం 872 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించటం జరుగుతుందన్నారు.
  • 14 పోస్టుమెట్రిక్‌ (కళాశాల విద్యార్థులు) వసతిగృహాల్లో ఎస్సీలకు 633, ఎస్టీ-5, బీసీ-27, ఓసీ-44 చొప్పున 672 మందికి ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
  • కులాల వారీగా వసతిగృహాల్లో ఖాళీలను భర్తీ చేస్తామని, ఇతర వివరాలకు 0891-2551001 ఫోన్‌ నెంబరులో సంప్రదించాలని కోరారు. ప్రవేశాలు సహాయ సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయం, సెక్టారు-9, ఎంవీపీకాలనీ, విశాఖపట్నం-17(9618788622), భీమిలి సహాయ సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం దరి, భీమిలి(9440316490) కార్యాలయాల్లో జరుగుతాయని తెలిపారు.

ఆధునికీకరణ పనుల తరువాత ఇలా.. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని