logo

భూ హక్కు చట్టం రద్దు నిర్ణయంపై న్యాయవాదుల హర్షం

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబునాయుడు భూయాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం చేసిన నేపథ్యంలో పలు న్యాయవాద సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Published : 14 Jun 2024 03:17 IST

విశాఖ లీగల్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబునాయుడు భూయాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం చేసిన నేపథ్యంలో పలు న్యాయవాద సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బెవర సత్యనారాయణ ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టం రద్దు కోసం విశాఖ న్యాయవాదుల సంఘం 79 రోజులపాటు విధులను బహిష్కరించిందన్నారు. చట్టం రద్దు నిర్ణయంపై తెదేపా లీగల్‌సెల్‌ అధ్యక్షుడు బత్తిరాజశేఖర్, అఖిల భారత న్యాయవాదుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీవీ రామాంజనేయరావు, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లాయర్స్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.సురేష్‌కుమార్, భాజపా లీగల్‌సెల్‌ నాయకులు గోలి శ్రీనివాస్, పలువురు న్యాయవాదులు హర్షం ప్రకటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని