logo

ఆహ్లాదం..అటకెక్కింది..!

జీవీఎంసీ 69వ వార్డు తుంగ్లాంలోని చెరువు సరైన నిర్వహణ లేక అధ్వానంగా మారింది. గ్రామం మధ్యలో ఉన్న చెరువు చుట్టూ నివాసాలు, ఆలయాలు, పాఠశాల ఉండడంతో...

Published : 14 Jun 2024 03:19 IST

నాడు: కళకళలాడుతున్న తుంగ్లాం చెరువు 

న్యూస్‌టుడే, అక్కిరెడ్డిపాలెం(ఆటోనగర్‌): జీవీఎంసీ 69వ వార్డు తుంగ్లాంలోని చెరువు సరైన నిర్వహణ లేక అధ్వానంగా మారింది. గ్రామం మధ్యలో ఉన్న చెరువు చుట్టూ నివాసాలు, ఆలయాలు, పాఠశాల ఉండడంతో... చెరువును అభివృద్ధి చేయాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. దీంతో 2014లో జీవీఎంసీ ముందుకొచ్చి అభివృద్ధి పనులు చేపట్టింది. చుట్టూ గట్టుపై వాకింగ్‌ ట్రాక్, ప్రజలు కూర్చోవడానికి వీలుగా సిమెంటు బల్లలు, చెరువులోకి దిగేందుకు మెట్లు ఏర్పాటు చేసింది. అప్పట్లో మురుగు నీరు చెరువులోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో వర్షం నీరు మాత్రమే చేరేది. చెరువులో చిన్నపాటి బోట్లపై ప్రజలు చక్కెర్లు కొట్టేవారు. కార్తిక మాసంలో, రథసప్తమి రోజున చెరువులో స్నానాలు చేసేందుకు, దీపాలు వెలిగించేందుకు భక్తులు ఆసక్తి చూపేవారు. ఇలా చెరువు పరిసరాలన్నీ ప్రజలకు ఆహ్లాదం పంచేవి. అయితే గత కొన్నాళ్ల నుంచి సరైన నిర్వహణ లేకపోవడంతో    ప్రస్తుతం చెరువు, అక్కడి పరిసరాలు అధ్వానంగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువులో పూడిక తీసి, శుభ్రత పనులు చేయించి... పూర్వ వైభవం తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

నేడు: అధ్వానంగా .. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని