logo

ఉపాధ్యాయులకు న్యాయం చేస్తాం

ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ అయిన సుమారు 350 మంది ఉపాధ్యాయులను తిరిగి మైదాన ప్రాంతానికి తీసుకురావడానికి కృషి చేస్తామని ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి సభ్యుడు వేపాడ చిరంజీవిరావు హామీ ఇచ్చారు.

Updated : 17 Jun 2024 02:57 IST

ఎమ్మెల్సీ చిరంజీవిరావుకు వినతిపత్రం ఇస్తున్న ప్రతినిధులు 

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ అయిన సుమారు 350 మంది ఉపాధ్యాయులను తిరిగి మైదాన ప్రాంతానికి తీసుకురావడానికి కృషి చేస్తామని ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి సభ్యుడు వేపాడ చిరంజీవిరావు హామీ ఇచ్చారు. అనకాపల్లి వచ్చిన చిరంజీవిరావును ఏజెన్సీ ప్రాంతానికి బదిలీ అయిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. జీఓ నం. 117 జీఓతో రాష్ట్రంలో ప్రాథమిక విద్యకు తీరని హాని జరిగిందన్నారు. దీంతో ఊహించని విధంగా విశాఖ జిల్లాలోని 55 ఏళ్లకుపైబడి వయస్సు కలిగినవారు, అనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లులు, భార్యాభర్తల ఉద్యోగులను మారుమూల గిరిజన ప్రాంతానికి 2023 జూన్‌లో బదిలీ చేశారన్నారు. వారంతా అంత దూరప్రాంతంలో ఉద్యోగాలు చేయడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాదయాత్ర సమయంలో తమకు న్యాయం చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ కూడా హామీ ఇచ్చారన్నారు. దీనిపై చిరంజీవిరావు మాట్లాడుతూ నం. 117 జీఓను రద్దు చేయడానికి, ఆ జీవో బాధితులకు న్యాయం చేయడానికి, ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సమస్యను ప్రత్యేకంగా విద్యామంత్రి నారా లోకేశ్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ సంఘాల నేతలు డి.గోపీనాథ్, పి.గణపతి, కె.ఉమామహేశ్వరరావు, పి.రామునాయుడు, పి.ఎ.ఆర్‌.వి.మహేష్, గంట్ల కృష్ణ, తులసీలక్ష్మి, భవాని తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని