logo

22న సింహాద్రి అప్పన్నకు మూడో విడత చందన సమర్పణ

జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 22న సింహాద్రి అప్పన్న స్వామికి మూడో విడత చందనం సమర్పణ సంప్రదాయబద్ధంగా జరగనుంది. ఆ మేరకు ఆదివారం నుంచి చందనం చెక్కలను అరగదీసే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు.

Published : 17 Jun 2024 03:00 IST

ఆలయ బేడామండపంలో చందనం చెక్కలు అరగదీస్తున్న సిబ్బంది

సింహాచలం, న్యూస్‌టుడే: జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 22న సింహాద్రి అప్పన్న స్వామికి మూడో విడత చందనం సమర్పణ సంప్రదాయబద్ధంగా జరగనుంది. ఆ మేరకు ఆదివారం నుంచి చందనం చెక్కలను అరగదీసే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఆలయ బేడామండపంలోని రాతి సానలపై సిబ్బంది చందనం చెక్కలను అరగదీసి శ్రీగంధాన్ని సేకరించారు. 

తొలిరోజు 35కిలోలు సమకూరినట్లు అధికారులు తెలిపారు. 22న వేకువజామున దాదాపు 140 కిలోల చందనంలో సుగంధ ద్రవ్యాలు మిళితం చేసి స్వామికి సమర్పణ చేస్తారు. ఆషాడ పౌర్ణమి నాడు నాలుగో విడతతో చందన సమర్పణ ప్రక్రియ పరిసమాప్తమవుతుంది. శ్రావణ పౌర్ణమినాడు కరాళ చందనం సమర్పణతో అప్పన్న స్వామి పరిపూర్ణ రూపంలో భక్తులను అనుగ్రహిస్తారు.

రేపు సాయంత్రం 6గంటల వరకే దర్శనం

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి సోదరి, అడివివరం గ్రామ దేవత శ్రీపైడితల్లి అమ్మవారి పండగ మంగళవారం వైభవోపేతంగా జరగనుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం 6గంటల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాలు లభించవని ఈవో సింగల శ్రీనివాసమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. 19న ఉదయం 6.30గంటల నుంచి యథావిధిగా దర్శనాలు లభిస్తాయన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని