logo

చోరీ సొత్తు స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

మండలంలోని తట్టబంద శివారు ఎల్‌.ఎన్‌.పురంలో బంగారం, వెండి వస్తువులు చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని నిందితులను బుధవారం

Published : 20 Jun 2024 04:05 IST

వివరాలు వెల్లడిస్తున్న సీఐ, ఎస్సై 

రావికమతం, న్యూస్‌టుడే: మండలంలోని తట్టబంద శివారు ఎల్‌.ఎన్‌.పురంలో బంగారం, వెండి వస్తువులు చోరీకి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని నిందితులను బుధవారం కోర్టుకు తరలించినట్లు కొత్తకోట సీఐ అప్పలనాయుడు చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఎల్‌.ఎన్‌.పురానికి చెందిన బోడిబాల అర్జునరావు కుటుంబీకులు ఈనెల 12న రాత్రి సమయంలో ఇంటి తలుపులు తాళాలు వేసి ఆరు బయట నిద్రిస్తుండగా కొత్తకోటకు చెందిన వై.రాజు, శ్రావణ్‌కుమార్, మణికంఠ ఆ ఇంట్లోకి చొరబడి రెండున్నర తులాల బంగారం నగలు (పుస్తుల తాడు, చెవి దిద్దులు), 25 తులాల వెండి పట్టీలు, అయిదు సెల్‌ ఫోన్‌లు, రెండు సెల్‌ పవర్‌ బ్యాంకులు అపహరించుకుపోయారని సీఐ చెప్పారు. నిందితులు ముగ్గురు బుధవారం చోరీ సొత్తును చోడవరంలో విక్రయించేందుకు బయిటలుదేరి మార్గమధ్యలో మేడివాడ బస్టాండ్‌లో ఆగారు. స్థానికుల సమాచారం మేరకు రావికమతం ఎస్‌ఐ ధనుంజయనాయుడు సిబ్బందితో వెళ్లి వై.రాజు, శ్రావణ్‌కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. మణికంఠ పరారయ్యాడు. పట్టుబడిన ఇద్దరు పాత నేరస్తులని, వీరిపై కొత్తకోట పోలీస్‌ స్టేషన్‌లో రెండు కేసులు ఉన్నాయని చెప్పారు. వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పరారీలో ఉన్న మణికంఠ దగ్గర పావు తులం బంగారం, ఒక సెల్‌ ఫోన్‌ ఉందని చెప్పారు. పట్టుబడిన ఇద్దరిని చోడవరం కోర్టుకు తరలించగా రిమాండు విధించినట్టు సీఐ తెలిపారు. చోరీకి పాల్పడిన వ్యక్తులను పట్టుకుని, సొత్తు రికవరీ చేసిన రావికమతం ఎస్‌.ఐ ధనుంజయనాయుడు, ఏఎస్‌ఐలు, పోలీసులను సీఐ అప్పలనాయుడు అభినందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని