logo

అయ్యన్నతో మాజీ మంత్రి దాడి భేటీ

మాజీమంత్రి దాడి వీరభద్రరావు బుధవారం నర్సీపట్నం శాసనసభ్యుడిగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడుతో భేటీ అయ్యారు. తెదేపా బీసీ సాధికార కమిటీ కన్వీనర్‌ మళ్ల సురేంద్ర అనుచరులతో వచ్చి ఆయనను సత్కరించారు.

Published : 20 Jun 2024 04:12 IST

అయ్యన్నను సత్కరిస్తున్న సురేంద్ర తదితరులు

నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: మాజీమంత్రి దాడి వీరభద్రరావు బుధవారం నర్సీపట్నం శాసనసభ్యుడిగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడుతో భేటీ అయ్యారు. తెదేపా బీసీ సాధికార కమిటీ కన్వీనర్‌ మళ్ల సురేంద్ర అనుచరులతో వచ్చి ఆయనను సత్కరించారు. అయ్యన్నను కలిసేందుకు జిల్లా నుంచి పలువురు తెదేపా నాయకులు, అధికారులు వస్తుండడంతో ఆయన నివాసం సందడిగా మారింది. జడ్పీ సీఈఓ పోలినాయుడు, పట్టణంలోని వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆయనను కలిశారు. 

నాతవరం, న్యూస్‌టుడే: తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తెదేపా సీనియర్‌ నాయకుడు లాలం అచ్చిరాజును వెన్నలపాలెంలో ఎమ్మెల్యేగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడు పరామర్శించారు. తెదేపా ఆవిర్భావం నుంచి అంకితభావంతో అచ్చిరాజు పనిచేశారని, అనారోగ్యంతో తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ పార్టీ విజయానికి కష్టపడ్డారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. తక్షణ వైద్యం కోసం ప్రయత్నించాలని కుటుంబసభ్యులను కోరారు. కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పార్టీ మండలాధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని