logo

పంటల వారీగా సాగు వివరాల నమోదు

కమతాలు, పంటలవారీగా సాగు వివరాలు నమోదు చేయాలని అర్థ గణాంకశాఖ ఉపసంచాలకులు కె.సౌజన్య పేర్కొన్నారు. కలెక్టరేట్లో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన బుధవారం...

Published : 20 Jun 2024 04:15 IST

మాట్లాడుతున్న ఉప సంచాలకులు సౌజన్య

కలెక్టరేట్, న్యూస్‌టుడే: కమతాలు, పంటలవారీగా సాగు వివరాలు నమోదు చేయాలని అర్థ గణాంకశాఖ ఉపసంచాలకులు కె.సౌజన్య పేర్కొన్నారు. కలెక్టరేట్లో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన బుధవారం 2వ దశ వ్యవసాయ గణన జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వ్యవసాయ గణనలో మండల స్థాయిలో సహాయ గణాంక అధికారులు, గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి ప్రాథమిక కర్తగా, మండల సహాయ గణాంక అధికారులు, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు పర్యవేక్షకులుగా ఉంటారన్నారు. వ్యవసాయ గణనను నిర్వహించే విధానం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు మాట్లాడుతూ వ్యవసాయ గణనకు సంబంధించి ఇన్‌పుట్ సర్వేలో రైతుల విద్యార్హతలు, వినియోగించే పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, రైతు బీమా, వ్యవసాయ రుణ వివరాలు మొదలగు అంశాలను ఎంపిక చేసిన గ్రామాల  వివరాలను మొబైల్‌ యాప్‌లో సేకరించాలన్నారు. గణాంక అధికారి ఎన్‌.శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని