logo

ప్రత్యేక ప్రణాళికతో డ్రగ్స్‌ నిర్మూలన : పల్లా

రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్‌ నిర్మూలనకు తెదేపా కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను నివారించడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం..

Published : 20 Jun 2024 04:27 IST

మాట్లాడుతున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పక్కన డీసీపీ సత్తిబాబు, ఏసీపీ త్రినాథ్‌

గాజువాక, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్‌ నిర్మూలనకు తెదేపా కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను నివారించడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం కృషి చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచించారు. బుధవారం గాజువాక టీఎస్సార్, టీబీకే కళాశాల ఆవరణలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. డ్రగ్స్‌ రహిత ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. ముఖ్యంగా నేటి యువత చెడు అలవాట్ల బారిన పడొద్దని సూచించారు. విశాఖ ఏజెన్సీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా నియంత్రణకు ఎక్కడికక్కడ నిఘా ఉంచుతామని  జోన్‌-2 డీసీపీ ఎం.సత్తిబాబు తెలిపారు. గంజాయి విక్రయాలు, డ్రగ్స్‌ నిల్వలు ఉంటే పోలీసుశాఖ దృష్టికి తీసుకురావాలన్నారు. సౌత్‌ ఏసీపీ టి.త్రినాథ్‌ మాట్లాడుతూ... ఈ అంశంపై ఇప్పటికే అన్ని స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. టీఎస్సార్, టీబీకే కళాశాల ఛైర్మన్‌ తలశిల బలరామకృష్ణ, అధ్యాపకులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని