logo

కేజీ టమాట @ 70

టామాటా ధర ఠారెత్తిస్తోంది. ఎన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది. అనకాపల్లి మార్కెట్లో కేజీ  రూ.70 పలుకుతుండడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.

Published : 20 Jun 2024 04:39 IST

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: టామాటా ధర ఠారెత్తిస్తోంది. ఎన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది. అనకాపల్లి మార్కెట్లో కేజీ  రూ.70 పలుకుతుండడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.  ఎండలకు దిగుబడి బాగా తగ్గిపోవడంతో ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. రైతుల నుంచి దళారులు ముందుగానే కొనుగోలు చేసి ధర పెంచేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి దిగుబడి సైతం గణనీయంగా తగ్గిపోవడం కూడా ధరలు పెరుగుదల కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు