logo

కూలీల్లో కోటి ఆశలు

కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధి కూలీలకు వేతన  సవరణ మరింత మెరుగ్గా ఉంటుందని వారంతా ఆశాభావంతో ఉన్నారు. చెరువుల్లో పూడిత తొలగింపు పనులకే పరిమితం కాకుండా రైతుల భూముల్లో ఉద్యాన పంటల సాగు,

Published : 20 Jun 2024 05:06 IST

మరింత మెరుగ్గా ఉపాధి హామీ
పాడేరు, రోలుగుంట - న్యూస్‌టుడే

కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధి కూలీలకు వేతన  సవరణ మరింత మెరుగ్గా ఉంటుందని వారంతా ఆశాభావంతో ఉన్నారు. చెరువుల్లో పూడిత తొలగింపు పనులకే పరిమితం కాకుండా రైతుల భూముల్లో ఉద్యాన పంటల సాగు, కందకాలు తవ్వి నీరు నిల్వ ఉండేలా పనులపై దృష్టిసారించాలని సూచిస్తున్నారు. 

వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. కక్ష కట్టినట్లు కొన్ని పథకాల అమలులో అలవిమాలిన నిర్లక్ష్యం చూపింది. ఇలాంటి వాటిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) ఒకటి. వలసల నివారణ కోసం తీసుకొచ్చిన ఈ పథకంలో చెరువుల రక్షణ, భూగర్భ జలాల పరిరక్షణ తదితర కీలక అంశాలున్నాయి. గతాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఈ పథకం ద్వారా కూలీలకు లబ్ధి చేకూర్చే వారు. ఇందుకు భిన్నంగా వైకాపా ప్రభుత్వం కూలీలకు కల్పించాల్సిన సదుపాయాల్లో కోత విధించింది. ఎండలో పని చేసే కూలీలు కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేందుకు టెంట్లు, కూలీలకు ఏదైనా జరిగితే తక్షణమే ప్రాథమిక వైద్యం అందించేందుకు మెడికల్‌ కిట్లు అందుబాటులో లేకుండా చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖను జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కేటాయించడంపై తమకు మేలు జరుగుతుందని ఉపాధి హామీ కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఉపాధి పనుల్లో కూలీలు 

  • రోలుగుంట మండల పరిధిలో ఇప్పటికే వంద ఎకరాల్లో జీడి, మామిడి తోటలను వేయడంతోపాటు మరో వంద ఎకరాల్లో సాగు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఏపీఓ సూర్యమణి పేర్కొన్నారు.
  • అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 22 మండలాల్లో జూన్‌ 19న 427 పంచాయతీల పరిధిలో ఉపాధి హామీ పనులు జరిగాయి. 1,19,155 మంది వేతనదారులు పనులకు హాజరయ్యారని డ్వామా పీడీ శివయ్య పేర్కొన్నారు. 

మొక్కల పెంపకం పనుల్లో..

2024-25 సంవత్సరంలో ఉపాధి పనులకు హాజరైన కుటుంబాలు : 1,90,383
ఉపాధి కూలీలు : 2,72,752
మొత్తం పని దినాలు: 75,46,469
సగటు వేతనం: రూ.296.02
సగటు పనిదినాలు : 39.64 రోజులు
చెల్లించిన వేతనం:  రూ.221.75 కోట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని