logo

ఏయూ వీసీ అన్యాయాలపై అసెంబ్లీలో చర్చించండి

ఆంధ్ర విశ్యవిద్యాలయం ప్రస్తుత వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రసాదరెడ్డి చేసిన అన్యాయాలపై అసెంబ్లీలో చర్చించాలని ఆ యూనివర్సిటీ న్యాయ కళాశాల విద్యార్థిని సత్యాల అంజనా ప్రియ రాష్ట్రంలోని కూటమికి చెందిన 140 మంది ఎమ్మెల్యేలకు లేఖలు రాశారు.

Published : 21 Jun 2024 02:46 IST

140 మంది ఎమ్మెల్యేలకు లేఖలు రాసిన ఏయూ విద్యార్థిని

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఆంధ్ర విశ్యవిద్యాలయం ప్రస్తుత వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రసాదరెడ్డి చేసిన అన్యాయాలపై అసెంబ్లీలో చర్చించాలని ఆ యూనివర్సిటీ న్యాయ కళాశాల విద్యార్థిని సత్యాల అంజనా ప్రియ రాష్ట్రంలోని కూటమికి చెందిన 140 మంది ఎమ్మెల్యేలకు లేఖలు రాశారు. ఇప్పటికే మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌తో పాటు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి తదితరులకు ఫిర్యాదులు చేసిన ఆమె తాజాగా ఏయూలో జరుగుతున్న అన్యాయాలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఎమ్మెల్యేలకు రాసిన లేఖల్లో కోరారు. తన లేఖలకు పలువురు శాసనసభ్యులు సానుకూలంగా స్పందించారని అంజనా ప్రియ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని