logo

సమస్యలపై మంత్రి అనితకు మత్స్యకారుల వినతి

తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మత్స్యకారులు గురువారం హోం మంత్రి అనితకు అమరావతిలో విన్నవించారు.

Published : 21 Jun 2024 02:48 IST

అనితకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు

నక్కపల్లి, న్యూస్‌టుడే: తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మత్స్యకారులు గురువారం హోం మంత్రి అనితకు అమరావతిలో విన్నవించారు. తెదేపా మండలశాఖ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్‌ ఆధ్వర్యంలో వీరంతా మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. రాజయ్యపేట, బోయపాడు, డీఎల్‌పురం గ్రామాలకు చెందిన తామంతా నంద్యాల ప్రాంతంలోని వీరభద్రదుర్గం, చీమలదిబ్బ ప్రాంతంలో వేట చేసుకుని జీవిస్తున్నామని, అయితే అటవీశాఖ అధికారులు తమను వేట చేయనీయకుండా వెళ్లిపోవాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వలలు, బోట్లు బలవంతంగా తీసుకెళ్లిపోయారని ఆరోపించారు. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేస్తేనే తమ వస్తువులు తిరిగి ఇస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఏళ్ల తరబడి ఇక్కడే ఉపాధి పొందుతుంటే, ఇప్పుడు బెదిరిస్తున్నారని ఆవేదన చెందారు. దీనిపై ఆమె మంత్రి ఫరూక్‌తో ఫోన్‌లో మాట్లాడి అటవీశాఖ అధికారులతో మాట్లాడాలని కోరారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మత్స్యకారులకు ఆమె హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని