logo

నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచాలి

ఎలమంచిలి నియోజకవర్గంలోని సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తున్న శారదా ఆయకట్టును విస్తరించి నీటిపారుదల వ్యవస్థలను మెరుగుకు చర్యలు తీసుకోవాలని ఎలమంచిలి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుందరపు విజయ్‌కుమార్‌ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు.

Published : 21 Jun 2024 02:53 IST

మంత్రి నిమ్మల రామానాయుడుతో సుందరపు

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ఎలమంచిలి నియోజకవర్గంలోని సాగు, తాగునీటి అవసరాలను తీరుస్తున్న శారదా ఆయకట్టును విస్తరించి నీటిపారుదల వ్యవస్థలను మెరుగుకు చర్యలు తీసుకోవాలని ఎలమంచిలి ఎమ్మెల్యేగా ఎన్నికైన సుందరపు విజయ్‌కుమార్‌ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కోరారు. గురువారం విజయవాడలోని మంత్రిని సుందరపు మర్యాదపూర్వకంగా కలిసి శారదా ఆయకట్టు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. కొండకర్ల ఆవ, ఎలమంచిలి పింజెరు, శారదా మైనర్, మేజర్‌ కాలువల అభివృద్ధికి సహకరించాలన్నారు.

సీఎం రమేశ్‌ను సన్మానిస్తున్న ప్రగడ నాగేశ్వరరావు

నూతన పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయండి

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ఎలమంచిలి నియోజకవర్గంలో నూతన పరిశ్రమలను తీసుకురావడానికి కృషిచేయాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్‌ను ఎలమంచిలి తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు కోరారు. ఎంపీగా ఎన్నికైన సీఎం రమేశ్‌ను ఆయన విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అనకాపల్లిని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారని ప్రగడ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని