logo

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) సూపరింటెండెంట్‌ కె.జయసింహ చౌదరి సూచించారు.

Published : 21 Jun 2024 02:55 IST

సదస్సులో మాట్లాడుతున్న ఎస్‌ఈబీ సూపరింటెండెంట్‌ జయసింహ చౌదరి

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఈబీ) సూపరింటెండెంట్‌ కె.జయసింహ చౌదరి సూచించారు. ఈనెల 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినంలో భాగంగా అనకాపల్లి శ్రీకన్య జూనియర్‌ కళాశాలలో గురువారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడు వ్యసనాల వల్ల జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మాదకద్రవ్యాల అలవాట్ల వల్ల జరిగే నష్టాలను వివరించారు. దీనిపై అవగాహన పెంచుకుని ప్రచారం చేయాలని విద్యార్థులకు సూచించారు. ఎస్‌ఈబీ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ శైలజారాణి, ఎస్‌ఈబీ అనకాపల్లి సీఐ అనిల్‌కుమార్, ఎస్సై శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని