logo

నీట్‌ అక్రమాలపై ఆందోళన

నీట్‌లో జరిగిన అక్రమాలపై విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గురువారం డిమాండ్‌ చేశారు.

Published : 21 Jun 2024 02:57 IST

నినాదాలు చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు 

ఎలమంచిలి, న్యూస్‌టుడే: నీట్‌లో జరిగిన అక్రమాలపై విచారణ నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గురువారం డిమాండ్‌ చేశారు. నీట్‌ను రద్దుచేసి మరోసారి దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఎలమంచిలి పట్టణంలో నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడినా కేంద్రం ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని మండిపడ్డారు. సుప్రీంకోర్టు సైతం దీనిపై స్పందించినా ప్రధానమంత్రి మాత్రం మాట్లాడకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికే 13 మందిని అరెస్టు చేసినా పరీక్ష రద్దు కోసం చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే మరింత ఆందోళనకరంగా ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.బాలాజీ, కేశవ, శ్రీను, అప్పలరాజు, విజయ్, గణేష్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని