logo

విశాఖలో ‘ఇజ్రాయిల్‌’ ఖర్జూరం

ఆంధ్రాలో ఖర్జూరం పండటమే అరుదు. అలాంటిది ఇజ్రాయిల్‌ దేశానికి చెందిన ఖర్జూర రకాన్ని విశాఖ నగరం కృష్ణరాయపురానికి చెందిన శాంతిలాల్‌ పటేల్‌ పండిస్తున్నారు.

Published : 21 Jun 2024 03:03 IST

ఆంధ్రాలో ఖర్జూరం పండటమే అరుదు. అలాంటిది ఇజ్రాయిల్‌ దేశానికి చెందిన ఖర్జూర రకాన్ని విశాఖ నగరం కృష్ణరాయపురానికి చెందిన శాంతిలాల్‌ పటేల్‌ పండిస్తున్నారు. గుజరాత్‌ రాష్ట్రం నుంచి పదిహేనేళ్ల క్రితం ఇజ్రాయిల్‌ జాతి మొక్కను తెచ్చి తన టింబర్‌ డిపోలో పెంచుతున్నారు.

అప్పుడు ఒక్కో మొక్కను ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.1250లకు రాయితీపై కొనుగోలు చేసి విశాఖ నేలపై పండుతుందో లేదోనని పరిశోధన నిమిత్తం ఇక్కడ నాటారు. ఏటా ఖర్జూరాలు గుత్తులుగా కాస్తున్నాయి. వీటిని ఉడతలు తినేయడంతో రక్షణగా కాగితపు కవర్లు కట్టి ప్రత్యామ్నయ ఏర్పాటు చేశారు.

 ఈనాడు, విశాఖపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని