logo

నిలిచిన సీబీసీఎన్‌సీ ప్రాజెక్టు పనులు

సిరిపురం రహదారిలో జీవీఎంసీ కమిషనర్‌ క్యాంపు కార్యాలయానికి ఆనుకుని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సీబీసీఎన్‌సీ (ది కన్వెన్షన్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ ది నార్తన్‌ సర్కార్స్‌) స్థలంలో చేపట్టిన భారీ ప్రాజెక్టు పనులను జీవీఎంసీ పట్టణ ప్రణాళికాధికారులు గురువారం రాత్రి నిలిపివేశారు.

Published : 21 Jun 2024 03:05 IST

సీబీసీఎన్‌సీ ప్రాజెక్టులో పనులు నిలిచిపోయిన ప్రాంతం

కార్పొరేషన్, న్యూస్‌టుడే: సిరిపురం రహదారిలో జీవీఎంసీ కమిషనర్‌ క్యాంపు కార్యాలయానికి ఆనుకుని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సీబీసీఎన్‌సీ (ది కన్వెన్షన్‌ బాప్టిస్ట్‌ చర్చ్‌ ఆఫ్‌ ది నార్తన్‌ సర్కార్స్‌) స్థలంలో చేపట్టిన భారీ ప్రాజెక్టు పనులను జీవీఎంసీ పట్టణ ప్రణాళికాధికారులు గురువారం రాత్రి నిలిపివేశారు. ఈ ప్రాంతంలో రాత్రి, పగలు తేడా లేకుండా ఇష్టానుసారం శబ్దాలు చేస్తూ ప్రమాదకరంగా లారీలతో గ్రావెల్‌ తరలింపు పనులు జరుగుతుండేవి. ప్రాజెక్టు నుంచి వస్తున్న ధూళి కమిషనర్‌ బంగ్లాలోకి వెళ్లకుండా ప్లాస్టిక్‌ షీట్లు అడ్డుపెట్టుకోవాల్సిన పరిస్థితులుండేవి.
ః సీబీసీఎన్‌సీ ప్రాజెక్టు వల్ల ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు జీవీఎంసీ ప్రధాన పట్టణ ప్రణాళికాధికారి సురేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన ఆయన కమిషనర్‌ సాయికాంత్‌వర్మ దృష్టికి తీసుకెళ్లారు. నిర్మాణదారుకు నోటీసులు జారీ చేసిన ప్రణాళికాధికారులు పనులు నిలిపివేయించారు. గురువారం రాత్రి ప్రణాళిక సిబ్బంది ప్రాజెక్టును సందర్శించి అక్కడున్న యంత్రాలను, వాహనాలను బయటకు తీసుకెళ్లాలని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జిలెటిన్‌ స్టిక్స్‌ పెట్టి రాళ్లను పేల్చడం, విపరీతమైన ధూళితో స్థానికులతో పాటు వాహన చోదకులు ఇబ్బందులు పడేవారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు