logo

వానొస్తే.. రోడ్డు చెరువే..

వర్షం పడితే మధురవాడ పైవంతెన నుంచి కారుషెడ్‌ కూడలి వరకూ సేవా రహదారి ఇరువైపులా నీట మునుగుతోంది. నిత్యం ఈ మార్గంలో వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

Published : 21 Jun 2024 03:06 IST

వర్షం పడితే మధురవాడ పైవంతెన నుంచి కారుషెడ్‌ కూడలి వరకూ సేవా రహదారి ఇరువైపులా నీట మునుగుతోంది. నిత్యం ఈ మార్గంలో వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గురువారం సాయంత్రం  అరగంటపాటు పడిన వర్షానికి ఆ రోడ్డు చెరువులా దర్శనమిచ్చింది. ఇక్కడ సక్రమమైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో కాలువల్లోని మురుగునీరంతా బయటకు ప్రవహించింది.

దాంతో అటువైపు వెళ్లే వాహనచోదకులు మురుగునీటిలో నుంచే ప్రయాణం సాగించాల్సి వచ్చింది. అధికార యంత్రాంగం స్పందించి ఈ మార్గంలో వర్షపు నీరు నిలిచిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, కొమ్మాది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని