logo

ఏయూలో ప్రభుత్వ ఉత్తర్వుల గుబులు

గత ప్రభుత్వంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా మళ్లీ అవే విధుల్లో కొనసాగుతున్న ఉద్యోగులు, అధికారులు తక్షణమే రాజీనామా చేయాలని గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ జారీచేసిన ఉత్తర్వులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గుబులు రేపుతున్నాయి.

Published : 21 Jun 2024 03:09 IST

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : గత ప్రభుత్వంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా మళ్లీ అవే విధుల్లో కొనసాగుతున్న ఉద్యోగులు, అధికారులు తక్షణమే రాజీనామా చేయాలని గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ జారీచేసిన ఉత్తర్వులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గుబులు రేపుతున్నాయి. ఏయూలో పలు విభాగాల్లో విశ్రాంత ఉద్యోగులను కొనసాగిస్తున్నారు. వీరిలో విశ్రాంత రిజిస్ట్రార్‌ ఆచార్య వి.కృష్ణమోహన్‌ ఒ.ఎస్‌.డి.గా పనిచేస్తున్నారు. ఫార్మసీ, న్యాయ, సైన్స్, మహిళా ఇంజినీరింగ్‌ కళాశాలలో విశ్రాంత ప్రిన్సిపాళ్లను కొనసాగిస్తున్నారు. వీరిని తొలగించి వర్సిటీలో అర్హులైన సీనియర్‌ ఆచార్యులను నియమించాలనే డిమాండ్‌ ఉన్నా ఏయూ అధికారులు స్పందించడం లేదు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో వీరిని తొలగిస్తారా లేదా అన్న చర్చ ఏయూలో కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని