logo

సువర్ణాక్షర సూరీడు... రామోజీరావు

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధించారంటే ఆయన సమగ్ర పరిశీలన, నిరంతర కృషే కారణం’ అని పలువురు గుర్తు చేసుకున్నారు.

Updated : 21 Jun 2024 04:26 IST

నివాళులర్పించిన ‘రామోజీ’ సంస్థల ఉద్యోగులు

ఈనాడు, విశాఖపట్నం: ‘రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు ఏ రంగంలో అడుగుపెట్టినా విజయం సాధించారంటే ఆయన సమగ్ర పరిశీలన, నిరంతర కృషే కారణం’ అని పలువురు గుర్తు చేసుకున్నారు. గురువారం విజయనగరం జిల్లా దేశపాత్రుని పాలెంలోని ‘ఈనాడు’ కార్యాలయంలో మేనేజర్‌ ఎన్‌. శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ కార్యక్రమంలో ఉద్యోగులు, సిబ్బంది, ‘న్యూస్‌టుడే కంట్రిబ్యూటర్లు’ పాల్గొన్నారు.

‘ఈనాడు’ కార్యాలయంలో రామోజీరావుకు నివాళులర్పిస్తున్న మేనేజర్‌ ఎన్‌.శ్రీనివాసులు

రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆయన సాగించిన కృషిని గుర్తు చేసుకున్నారు. అక్షర శక్తిని ‘ఈనాడు’ ద్వారా నిరూపించి ప్రగతి వెలుగులకు దారి చూపారన్నారు. రామోజీరావు వ్యక్తి కాదు.. మహాశక్తని, తరతరాలకు స్ఫూర్తి ప్రదాతని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఆయన మార్గదర్శనం చేసిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు.

‘ఈనాడు’ కార్యాలయంలో రామోజీరావుకు నివాళులర్పిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది

విశాఖలోని సీతంపేట, ఎంవీపీ కాలనీ, డాబాగార్డెన్స్, ఎన్‌ఏడీ, కూర్మన్నపాలెం, మధురవాడ, గాజువాక, అనకాపల్లి మార్గదర్శి శాఖల్లో సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించి ఉద్యోగులు శ్రద్ధాంజలి ఘటించారు. నగరంలోని డాల్ఫిన్‌ హోటల్‌లో, రామాటాకీస్‌ వద్ద ఉన్న కళాంజలి షోరూంలో, నగరంలోని ‘ప్రియ’ దుకాణాలలో రామోజీరావుకు సిబ్బంది నివాళులర్పించారు.

విశాఖ డాబాగార్డెన్స్‌ మార్గదర్శి శాఖలో నివాళులర్పిస్తున్న ఉద్యోగులు

డాల్ఫిన్‌ హోటల్‌లో...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని