logo

ఏడీఆర్‌గా ముకుందరావు

అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం సహ సంచాలకులు (ఏడీఆర్‌)గా డాక్టర్‌ సీ‡హెచ్‌ ముకుందరావును ప్రభుత్వం నియమించింది.

Published : 22 Jun 2024 03:07 IST

అనకాపల్లి, న్యూస్‌టుడే: అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం సహ సంచాలకులు (ఏడీఆర్‌)గా డాక్టర్‌ సీ‡హెచ్‌ ముకుందరావును ప్రభుత్వం నియమించింది. ఈమేరకు ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈయన శనివారం బాధ్యతలు స్వీకరిస్తారు. ముకుందరావు ప్రస్తుతం అనకాపల్లి పరిశోధన కేంద్రంలో వృక్ష శరీర ధర్మశాస్త్ర విభాగం ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఇంతవరకు ఇక్కడ ఏడీఆర్‌గా పనిచేసిన పీవీకే జగన్నాథరావు రెండేళ్ల పదవీ కాలం ముగిసింది. అనకాపల్లిలోని పంటకోత అనంతర విభాగం ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఈయన ఇంతవరకు రెండు పోస్టులు నిర్వహించేవారు. ఇక నుంచి ఇదే విభాగం ప్రధాన శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని