logo

కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు చిత్రపటం

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్, జేసీ ఛాంబర్లతోపాటు సమావేశమందిరంలో చంద్రబాబు చిత్రపటాలను ఏర్పాటు చేశారు.

Published : 22 Jun 2024 03:08 IST

వన్‌టౌన్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్, జేసీ ఛాంబర్లతోపాటు సమావేశమందిరంలో చంద్రబాబు చిత్రపటాలను ఏర్పాటు చేశారు. మిగిలిన ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల నియమావళి వచ్చిన తర్వాత నాటి సీఎం జగన్‌ ఫొటోలను ప్రభుత్వ కార్యాయాల్లో తొలగించారు. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు ఫొటోలు పెట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని